03-03-2025 03:05:31 PM
హైదరాబాద్,(విజయక్రాంతి): తెలంగాణ శాసనమండలి ఎన్నికలకు సంబంధించి రెండు ఉపాధ్యాయ, ఒక గ్రాడ్యుయేట్ నియోజకవర్గానికి జరిగిన ఓట్ల లెక్కింపు(MLC election results) సోమవారం కొనసాగుతోంది. నల్గొండ వేర్ హౌసింగ్ గిడ్డంగిలో నల్గొండ-ఖమ్మం-వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ, కరీంనగర్ లోని అంబేడ్కర్ ఇండోర్ స్టేడియంలో కరీంనగర్-మెదక్-నిజామాబాద్, ఆదిలాబాద్ టీచర్ ఎమ్మెల్సీ, కరీంనగర్-మెదక్-నిజామాబాద్, ఆదిలాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అలాగే ఓట్ల లెక్కింపు ఇవాళ ఉదయం 8 గంటల నుంచి కొనసాగుతుంది. నల్లగొండ-వరంగల్-ఖమ్మం టీచర్స్ ఎమ్మెల్సీ నియోజకవర్గం నుంచి తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో పీఆర్టియూ అభ్యర్థి పింగిలి శ్రీపాల్ రెడ్డి ముందంజలో ఉన్నారు.
ఆయన 1500 ఓట్ల అధిక్యంతో మొదటి స్థానం, రెండో స్థానంలో యూటీఎఫ్ అభ్యర్థి నర్సిరెడ్డి ఉన్నారు. (శ్రీపాల్ రెడ్డి-6700, నర్సిరెడ్డి-4778, హర్షవర్ధన్-4421, పూలరవీందర్-3216, సరోత్తం రెడ్డి-2347) మరీ తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు కొద్దిసేపట్లో ముగియనుంది. తొలి ప్రాధాన్యత ఓట్లలో 50 శాతం కంటే ఎక్కువ వచ్చిన అభ్యర్థులే విజేతలుగా నిలుస్తారని ఎన్నికల అధికారులు పేర్కొన్నారు. తొలి ప్రాధాన్యత ఓట్లలో విజేత తేలకపోతే రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఇకా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపునకు 30 గంటల సమయం, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపునకు రెండున్నర రోజులు పట్టే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.