calender_icon.png 8 February, 2025 | 11:09 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అధికారులకు త్వరితగతిన పిఆర్పి చెల్లించాలి

08-02-2025 09:02:01 PM

సిఎంఓఏఐ ఏరియా అధ్యక్షుడు రమేష్..

మందమర్రి (విజయక్రాంతి): బొగ్గు గనుల్లో పని చేస్తున్న అధికారులందరికీ జీతంలో భాగమైన పెర్ఫార్మెన్స్ రిలేటెడ్ పే(పిఆర్పి) 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వెంటనే చెల్లించాలని సిఎంఓఏఐ ఏరియా అధ్యక్షులు రమేష్ డిమాండ్ చేశారు. శనివారం ఏరియాలనీ జీఎం కార్యాలయంలో జరిగిన సీఎం ఓఏఐ కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. కోలిండియాలో జూన్,2024లో చెల్లించబడినప్పటికీ, సింగరేణిలో ఇప్పటివరకు చెల్లించకపోవడంతో అధికారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని, త్వరగా సింగరేణిలో పనిచేసే అధికారులకు పిఆర్పి చెల్లింపునకు ఏర్పాటు చేయాలని కోరారు.

నవంబర్ 25, 2024న అధికారుల సంఘంతో జరిగిన నిర్మాణాత్మక సమావేశంలో యాజమాన్యం దృష్టికి వచ్చిన సమస్యల పరిష్కారానికి వెంటనే ఆదేశాలు ఇవ్వాల్సిందిగా కోరారు. అదేవిధంగా సింగరేణి భవిష్యత్తు, పురోభివృద్ధికి ఈ ఆర్థిక సంవత్సరం ఉత్పత్తి లక్ష్యసాధనకు నిర్దేశకత్వం చేసే అతి ముఖ్యమైన ఫంక్షనల్ డైరెక్టర్ల విషయంలో కొనసాగుతున్న అనిశ్ఛితి స్థితి తొలిగేలా న్యాయమైన నిర్ణయం తీసుకొని, సింగరేణి పురోభివృద్ధికి, సంస్థ పట్ల నిబద్ధతతో, నిజాయితీగా పనిచేయు అధికారులకు భరోసా ఇస్తూ, లక్ష్యసాధన దిశగా పూర్తిస్థాయిలో పనిచేసే విధంగా నిర్ణయం తీసుకోవాలని కోరారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఏరియా జిఎం దేవేందర్ కు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు డి నాగవర్ధన్, జాయింట్ కార్యదర్శులు నరేష్, కె రవి, జాయింట్ కోశాధికారి ఎం సంతోష్, యూనియన్ కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.