calender_icon.png 9 November, 2024 | 7:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ధాన్యం కొనుగోళ్లలో నిబంధనలు బేఖాతరు

09-11-2024 12:00:00 AM

ముగ్గురు అధికారులపై సస్పెన్షన్  వేటు 

నల్లగొండ, నవంబర్ 8 (విజయక్రాంతి): నల్లగొండ జిల్లా గుర్రం పోడు మండలం కొప్పోలు పీఏసీఎస్ కేంద్రంలో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియలో నిబంధనలు అతిక్రమించిన ముగ్గురు అధికారులపై సస్పెన్షన్ వేటు పడింది. శుక్రవారం కొనుగోలు  కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్ ఇలా త్రిపాఠి రికార్డులను పరిశీలించి అసంతృప్తి వ్యక్తం చేశారు. ధాన్యంలో తేమశాతం పర్యవేక్షణ, బస్తాల లోడింగ్, కొనుగోళ్ల పర్యవేక్షణ తదితర అంశాల్లో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన ఏఈవో రామాజంనేయులు, పీఏసీఎస్ సీఈవో సాయికుమార్, సెంటర్ ఇన్‌చార్జి ధర్మయ్యను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులిచ్చారు.