calender_icon.png 21 October, 2024 | 3:48 AM

పాలిటెక్నిక్ లెక్చరర్ల ప్రొవిజనల్ జాబితా

21-10-2024 01:40:07 AM

హైదరాబాద్, అక్టోబర్ 20 (విజయక్రాం తి): ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో లెక్చరర్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల ప్రొవిజనల్ జాబితాను టీజీపీఎస్సీ ఆదివారం విడుదల చేసింది. సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్ ఇంజినీరింగ్ లెక్చరర్ల పోస్టుల కోసం డిసెంబర్ 2022లో నెం. 20/2022 నోటిఫికేషన్ ద్వారా పరీక్ష నిర్వహించారు. వారి ప్రొవిజినల్ జాబితాను టీజీపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్ https://www.tspsc.gov.in లో ఉంచినట్లు అధికారులు వెల్లడించారు.