10-03-2025 07:18:22 PM
నిజాంసాగర్ (విజయక్రాంతి): జాతీయ మహాత్మా గాంధీ ఉపాధి పథకంలో భాగంగా పనిచేస్తున్న కూలీలకు సోమవారం నీడ వసతి కల్పించారు. నిజాంసాగర్ మండలంలోని హసన్ పల్లి గ్రామంలో ఫీల్డ్ అసిస్టెంట్ ప్రత్యేక చొరవ తీసుకొని కూలీలకు నీడ వసతి ఏర్పాటు చేసినట్లు ఉపాధి హామీ కూలీలు తెలిపారు. ఎండలు తీవ్రంగా ఉండడంతో మధ్యాహ్నం సమయంలో వసతి సౌకర్యాన్ని కూలీలకు కల్పించారు.