04-03-2025 12:00:00 AM
కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశాల మేరకు ఇద్దరు దివ్యాంగులకు పరికరాలు అందజేశారు. ఎల్లారెడ్డి పేట మండలం గొల్లపల్లికి చెందిన దాసరి పవన్ అనే బాలుడు పుట్టుక తోనే నడవలేని స్థితిలో ఉన్నాడు. తనకు వీల్ చైర్ ఇప్పించాలని కలెక్టర్ సందీ ప్ కుమార్ ఝాకు విన్నవించాడు.
తనకు మ్యానువల్ ట్రై సైకిల్ ఇప్పించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝాకు వేములవాడ లోని సాయి నగర్ కు చెందిన లేదేళ్ల రమేష్ విన్నవించాడు. కలెక్టర్ ఆదేశాల మేరకు దాసరి పవన్ కు వీల్ చైర్, లేదేళ్ల రమేష్ కు మ్యానువల్ ట్రై సైకిల్, సంక కర్ర జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజం అందజేశారు. తమకు వీల్ చైర్, ట్రై సైకిల్ అందించి, ఆదుకున్న కలెక్టర్ కు వారు ఇద్దరు కృతజ్ఞతలు తెలిపారు.