యాదాద్రి భువనగిరి, జనవరి 18 (విజయక్రాంతి): జిల్లాలోని 188 ప్రభుత్వ పాఠశాలల్లో 10వ తరగతి విద్యను అభ్యసిస్తున్న 5944 మంది విద్యార్థులకు జిల్లా విద్యాశాఖ తరఫున ఉచిత స్టడీ మెటీరియల్‌ను ఉపాధ్యాయులచే తయారుచేసి దివీస్ లాబోరేటరీ వారి ఆర్థిక సౌజన్యంతో ముద్రించడం జరిగింది. ఈ మెటీరియల్‌ను శనివారం కలెక్టర్ హన్మంతరావు, డీఈవో సత్యనారాయణ విద్యార్థులకు పంపిణీ చేశారు. దివీజ్ యాజమాన్యం తరఫున కిషోర్‌కుమార్, గోపి, కలెక్టరేట్ సహాయ సంచాలకులు ప్రశాంత్‌రెడ్డి, విద్యార్థులు పాల్గొన్నారు.