19-03-2025 04:35:29 PM
చెరుకు శ్రీనివాస్ రెడ్డి...
చేగుంట (విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వంలో మూడు ఘనవిజయాలు, బీసీ రిజర్వేషన్ల బిల్లు, ఎస్సీ వర్గీకరణ బిల్లు, రాజీవ్ యువ వికాస పథకం అసెంబ్లీలో చట్టం చేయడం, యువ వికాసం పథకం దిగ్విజయంగా ప్రారంభించడంతో చేగుంట మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం మండల కేంద్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రులు దామోదర రాజనర్సింహ, పొన్నం ప్రభాకర్, చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దుబ్బాక కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా తాను మాట్లాడుతూ... రాజీవ్ యువ వికాస పథకం కింద నిరుద్యోగులకు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ యువతకు స్వయం ఉపాధి కల్పించాలని ఉద్దేశంతో ఈ ప్రజా ప్రభుత్వం.. మూడు బిల్లులను ప్రవేశపెట్టడం గర్వించదగ్గ విషయమని అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతుందని కొనియాడారు. పట్టణ, గ్రామీణ అభివృద్ధి కాంగ్రెస్ లక్ష్యం. అనంతరం పట్టణ కేంద్రంలో 10 లక్షలతో ఎన్జీవోస్ కాలనీలో, అలాగే ఐదు లక్షల రూపాయలు ఎస్సీ కాలనీలో సిసి రోడ్ల పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు వడ్ల నవీన్ కుమార్, ఉపాధ్యక్షులు మసాయిపెట్ శ్రీనివాస్, జనరల్ సెక్రటరీ మొజామిల్, మాజీ ఎంపీపీ మసుల శ్రీనివాస్, మాజీ పిఎసిఎస్ చైర్మన్ వెంగల్ రావు, ఎస్సి సెల్ అధ్యక్షులు స్టాలిన్ నర్సిములు, ఓబీసీ అధ్యక్షులు ఆంజనేయులు, కిసాన్ సెల్ అధ్యక్షులు చౌదరి శ్రీనివాస్, యువజన కాంగ్రెస్ అధ్యక్షులు మోహన్ నాయక్, యూవజన నాయకులు సండ్రగు శ్రీకాంత్, సంఘ సేవకుడు అయిత పరంజ్యోతి, జిల్లా మహిళా నాయకురాలు కుర్మ లక్ష్మి, జుకంటి రాజగౌడ్, నాగేష్ గుప్తా, జగన్ గౌడ్, బాస్ రాజు తదితరులు పాల్గొన్నారు.