15-03-2025 12:16:03 AM
కోదాడ, మార్చి 14: ప్రతిభ కలిగిన పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం అందజేసి అండగా ఉంటామని డిసిసిబి మాజీ చైర్మన్ ముత్తవరపు పాండురంగారావు అన్నారు. శుక్రవారం కోదాడ పట్టణం లోని పబ్లిక్ క్లబ్ లో మండల పరిధిలోని కాపుగల్లు గ్రామానికి చెందిన ఇంజనీరింగ్ మూడో సంవత్సరం చదువుతున్న బాలబోయిన పుల్లయ్య గౌడ్ కూతురు ఉమా కు 20వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని మిత్ర మండలి సభ్యులతో కలిసి అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేదరికంలో ఉండి ప్రతిభ కలిగిన విద్యార్థులకు ఎల్లవేళలా తన వంతు సహాయ సహకారాలు అందిస్తా అన్నారు.
ఆర్థిక సహాయం అందజేయుటకు మిత్రమండలి సభ్యులు , డాక్టర్ సుభాష్ చంద్రబోస్ , కొల్లు వెంకటగిరి అందించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రావెళ్ల సీతారామయ్య, మేకల వెంకట్రావు, సత్య బాబు, శ్రీనివాసరావు, నరసయ్య, రామారావు,క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు పట్టాభి రెడ్డి, బోల్లు రాంబాబు, ఓరుగంటి రవి, లింగారెడ్డి,తీగల కరుణాకర్, రామారావు, నల్లూరి రవి,నెల్లూరి వెంకటేశ్వర్లు, పసుపులేటి నాగేశ్వరరావు పాల్గొన్నారు