14-04-2025 09:31:30 PM
మహబూబాబాద్ (విజయక్రాంతి): పదో తరగతి వరకు తమతో కలిసి చదువుకున్న మిత్రుడు అకాల మృత్యువాత పడగా అతని కుటుంబానికి క్లాస్మేట్స్ 25 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించిన ఘటన మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండలం అయ్యగారి పల్లిలో జరిగింది. ఇనుగుర్తి జిల్లా పరిషత్ పాఠశాలలో 1986 - 87 టెన్త్ బ్యాచ్ పూర్వ విద్యార్థి గొంగళ్ల వెంకన్న అనారోగ్యంతో మృతి చెందాడు. అతనితో కలిసి చదువుకున్న క్లాస్మేట్స్ వద్దిరాజు చంద్రప్రకాష్, గంజి శ్రీనివాస్ రెడ్డి, కన్న సాంబయ్య, పరుపాటి వెంకన్న, బేతమళ్ళ భారతి, మార్క శ్యామ్, పబ్బ విజయ్, గండు రమేష్, కొమ్మన బోయిన ఐలయ్య , మాలోత్ రాములు నాయక్, వేముల పల్లి శ్రీరాములు తదితరులు కలిసి సమకూర్చిన 25వేల రూపాయల నగదు, 50 కేజీల బియ్యం మిత్రుని కుటుంబానికి అందజేశారు.