calender_icon.png 25 March, 2025 | 6:38 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆర్థిక సాయం అందజేత

23-03-2025 07:03:58 PM

బాన్సువాడ (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గం రుద్రూర్ మండలం అంబం గ్రామంలో పున్న సావిత్రి, బడే లక్ష్మి ఇండ్లు ప్రమాదవశాత్తు కాలిపోవడంతో నిరాశ్రయులయ్యారు. బాధితులకు ఆదివారం నిత్య అవసర వస్తువులు కొనుగోలు చేసుకోవడానికి మానవతా దృక్పధంతో రూ.10,000 రూపాయలు మాజీ ఉమ్మడి రాష్ట్ర ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు యలమంచిలి శ్రీనివాస్ రావు ఆర్థిక సాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో నస్రుల్లాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నందు పటేల్, రుద్రూర్ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు మహేష్, అంబం గ్రామ అధ్యక్షులు బట్టు నాగయ్య, కార్యదర్శి శానం గంగారాం, కుర్మా బాలయ్య, ఒడ్డె సాయిలు, దస్తగిరి,మూడ పోశెట్టి, రామసాని సాయిలు, శానం వేంకటి, నిజాం, అంజయ్య, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.