12-03-2025 01:24:18 AM
మంచిర్యాల, మార్చి 11 (విజయక్రాంతి) : జిల్లా కేంద్రంలోని రాజీవ్ నగర్ కేజీబీవీ పాఠశాలలో 20 మంది విద్యార్థులకు జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ చేతుల మీదుగా మంగళవారం కంటి అద్దాల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 568 పాఠశాలల్లో, 164 రెసిడెన్షియల్ పాఠశాలల్లో 8 ఆర్ బి ఎస్ కే బృందాల ద్వారా పిల్లలకు పరీక్షలు చేశామన్నారు. ఇందులో 1274 మంది విద్యార్థులు కంటి సమస్యలతో బాధపడుతున్నట్లు గుర్తించామన్నారు.
వీరందరిని గత నెలలో కంటి వైద్య నిపుణులు డాక్టర్ యశ్వంతరావు, డాక్టర్ చంద్రబాన్, డాక్టర్ శిల్ప శ్రీ,ఆప్తమిక అధికారులు శంకర్, భాస్కర్ రెడ్డిలు ప్రభుత్వాసుపత్రిలో తిరిగి పరీక్షలు నిర్వహించి అద్దాల కోసం పంపించగా తెలంగాణ ప్రభుత్వం అవసరమైన వారందరి కోసం అద్దాలను పంపించిందన్నారు. కంటెక్ట్ సంబంధించిన వ్యాధులు రాకుండా ఆహార అలవాట్లను చేసుకోవాలని, ఏదైనా సమస్యలు ఉంటే ఆర్ బి ఎస్ కి బృందాల ద్వారా గుర్తించి ప్రభుత్వపరంగా చికిత్సలు పొందాలని సూచించారు.
ప్రతి ఆశ్రమ పాఠశాలలు, రెసిడెన్షియల్ పాఠశాలల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ హరీష్ రాజ్, జిల్లా ఉప వైద్యాధికారి డాక్టర్ ఎస్ అనిత, నోడల్ ఆఫీసర్ డాక్టర్ యశ్వంతరావు, జిల్లా అందత్వ నివారణ అధికారి డాక్టర్ ప్రసాద్, ప్రోగ్రాం ఆఫీసర్లు డాక్టర్ కృపాబాయి, వైద్యాధికారులు డాక్టర్ అశోక్, డాక్టర్ శ్వేత, ఆప్తాలమిక శంకర్, జిల్లా మాస్ మీడియా అధికారి బుక్క వెంకటేశ్వర్, స్కూల్ ప్రిన్సిపల్ స్వప్న, టీచర్లు, విద్యార్థులు, ఆర్ బి ఎస్ కే వైద్యాధికారులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.