02-04-2025 06:50:17 PM
కాటారం (విజయక్రాంతి): ప్రమాదవశాత్తు జరిగిన అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయిన బాధిత కుటుంబానికి మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ చేయూతనందించారు. కాటారం మండలం దేవరాంపల్లి గ్రామానికి చెందిన జిముడ దుర్గక్క అనే మహిళకు చెందిన ఇల్లు అగ్ని ప్రమాదానికి గురై కాలిపోయింది. ఈ ప్రమాదంలో సర్వం కోల్పోయిన బాధిత మహిళను మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ పరామర్శించి, ఆమెకు నిత్యావసర సరుకులు, వంట సామగ్రి, 25 కిలోల బియ్యం అందజేశారు. అధైర్యపడవద్దని, అండగా ఉంటామని ఆమెకు భరోసా కల్పించారు. అలాగే స్థానిక తహశీల్దార్‌కు ఫోన్ చేసి అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయిన దుర్గక్క కుటుంబానికి తక్షణ సాయం అందించాలని కోరారు.
కాటారం మండలంలో పలు గ్రామాలలో బాధిత కుటుంబాలను మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ పరామర్శించారు. దేవరాంపల్లిలో బండి మధునయ్య ఇటీవల మరణించగా వారి కుటుంబాన్ని, పరికిపల్లిలో ఇటీవల శస్త్ర చికిత్స చేసుకున్న కోలుగురి సమ్మయ్యను పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఆదివారంపేటలో అనారోగ్యంతో బాధపడుతున్న రత్న రమేష్ రెడ్డిని పరామర్శించారు. ఆయన వెంట బిఆర్ఎస్ నాయకులు జక్కు రాకేష్, జోడు శ్రీనివాస్, బండం రాజమణి, ముల్కలపల్లి శ్రీలక్మి చౌదరి, కొండగొర్ల వెంకటస్వామి, గాలి సడవలి, చీమల వంశీ, బండం లక్ష్మారెడ్డి, మెడిగడ్డ దుర్గారావు తదితరులు పాల్గొన్నారు.