calender_icon.png 22 November, 2024 | 11:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విలువలతో కూడిన విద్యను అందించండి: ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి

22-07-2024 01:05:02 PM

మహబూబ్ నగర్: విలువలతో కూడిన విద్యను విద్యార్థులకు అందించాలని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి  ఉపాధ్యాయులకు సూచించారు. సోమవారం మహబూబ్ నగర్ పురపాలక పరిధిలోని బోయపల్లి లో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బుచ్చన్న  గౌడ్ గారి స్మారకార్థం వారి సతీమణి వనమాల గారు నిర్మించిన  అదనపు తరగతి గదులను ప్రారంభించి భవన నిర్మాణ దాతను అభినందించారు.   అనంతరం ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయులకు కావాల్సిన న్యాయమైన కోరికలు, సమస్యలన్ని  పరిష్కారించామని అందులో  ప్రధానంగా పదోన్నతులు, బదిలీలు ఈ ప్రభుత్వం  పారదర్శకంగా నిర్వహించిందని ఆయన స్పష్టం చేశారు.  విద్యార్థులకు ఉచితంగా పాఠ్యపుస్తకాలు యూనిఫాం కూడా పాఠశాల ప్రారంభం రోజునే విద్యార్థులకు అందించడం జరిగిందని,  పాఠశాల లో ఉన్న అత్యవసరమైన మౌళిక వసతులను కూడా  చేయించడం జరిగిందని ఆయన గుర్తు చేశారు. 

ఇక పిల్లల భవిష్యత్తు మీ చేతిలో ఉందని, ఆ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని వారిని మంచి పౌరులుగా తీర్చిదిద్ది సమాజానికి అందించాలని ఆయన కోరారు.   మహిళా సంఘాలకు విద్యా కమిటీ ల నిర్వహణ బాధ్యత అప్పగించడం జరిగింది అని ఆయన గుర్తు చేశారు.    అనంతరం పాఠశాల లోని తరగతి గదులను తిరిగి పరిశీలించారు.   ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్, జిల్లా విద్యాశాఖాధికారి రవింధర్, ఎంఇఓ జయశ్రీ, పాఠశాల ప్రధానోపాధ్యాయులు సి.కవిత, కౌన్సిలర్  మోతిలాల్,  మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్ రెడ్డి,  వనమాల బుచ్చన్న గౌడ్, సత్తూర్ చంద్రకుమార్ గౌడ్, డిసిసి ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు లక్ష్మణ్ యాదవ్,  కౌన్సిలర్ జాజి మొగ్గ నర్సింహులు, హెచ్ ఎం. నర్సింహులు, దేవేందర్ నాయక్, గోపి నాయక్, అబ్దుల్ హక్ , తులసి రామ్ నాయక్, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.