calender_icon.png 6 March, 2025 | 11:22 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టైగర్ యూనిట్లను సత్వరమే లబ్ధిదారులకు అందించండి

06-03-2025 08:19:36 PM

అధికారులను ఆదేశించిన ఐటిడిఎపిఓ రాహుల్...

భద్రాచలం (విజయక్రాంతి): ట్రైకర్, ఎంఎస్ఎంఈ యూనిట్లకు సంబంధించి బ్యాంకులో లబ్ధిదారులకు సంబంధించిన యూనిట్లు లాగిన్ అయ్యి పెండింగ్ లో ఉన్న ఖాతాలను త్వరితగతిన క్లియర్ చేయాలని, ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ సంబంధిత బ్యాంక్ అధికారులకు ఆదేశించారు. గురువారం తన చాంబర్లో ఐటీడీఏ యూనిట్ అధికారులు, బ్యాంకర్స్ తో ట్రైకర్, ఎంఎస్ఎంఈ యూనిట్, గిరిజన నిరుద్యోగ యువకులకు జీవనోపాధి పెంపొందించుట కొరకు సబ్సిడీ ద్వారా సాంక్షన్ చేసిన రుణాలు లబ్ధిదారులకు అందే విధంగా బ్యాంకర్లు తీసుకోవలసిన కార్యాచరణపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ... 2020-21, 2021-22 సంవత్సరములో ట్రైకర్ కు సంబంధించిన యూనిట్లు లాగిన్ అయి గ్రౌండ్ చేసిన 70 యూనిట్లను మార్చి 31 నాటికి కంప్లీట్ చేసి లబ్ధిదారులకు అందే విధంగా చూడాలని, అదేవిధంగా ఎంఎస్ఎంఈ పథకం కింద లబ్ధిదారులకు మంజూరైన యూనిట్లకు సంబంధించి కొన్ని కారణాల వలన బ్యాంకులో పెండింగ్ ఉన్న లోన్ లకు సంబంధించిన లబ్ధిదారులకు వాటిని సరిచేసి ప్రతిపాదనలు రాగానే వెంటనే లోన్లు అందించాలని అన్నారు. అర్హులైన లబ్ధిదారులను మాత్రం బ్యాంకర్స్ ఇబ్బంది పెట్టవద్దని వీలైనంత తొందరగా అన్ని కంప్లీట్ చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సహాయ ప్రాజెక్టు అధికారి జనరల్ డేవిడ్ రాజ్, ఏడి అగ్రికల్చర్ భాస్కరన్, లీడ్ బ్యాంకు మేనేజర్ రామ్ రెడ్డి, జేడీఎం హరికృష్ణ వివిధ బ్యాంకు మేనేజర్లు తదితరులు పాల్గొన్నారు.