04-04-2025 01:08:58 AM
మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాం నాయక్
మహబూబాబాద్, ఏప్రిల్ 3 (విజయ క్రాంతి): పార్లమెంట్ జరిగిన జీరో అవర్‌లో మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యులు శ్రీ పోరిక బలరాం నాయక్ గారు మహబూబాబాద్ పార్లమెంట్ సమస్యలపై మాట్లాడారు..తన నియోజకవర్గం లో గిరిజన, ఆదివాసీలతో పాటు ఏజెన్సీ ప్రాంతంలో నివసించే ప్రజలు ఎక్కువగా ఉంటారని, వారు విధ్యకి చాలాదూరంలో ఉంటారని ఆవేదన చెందారు.
వారు అభివృద్ధి చెందాలంటే చదువుకోవడం అవసరం అన్నారు. అందుకు అనుగుణంగా మూడు కొత్త నవోదయ విద్యాలయాలు ఏర్పాటు చేసి గిరిజన,ఆదివాసీ,ఏజెన్సీ ప్రజలను చదువుకు దగ్గర చేసి వారు ఉన్నత శిఖరాలకు చేరుకునేందుకు కేంద్ర ప్రభుత్వం సహకరించాలని బలరాం నాయక్ కోరారు.