calender_icon.png 12 January, 2025 | 1:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆయిల్ పామ్‌కు మద్దతు ధర కల్పించండి

07-09-2024 12:56:17 AM

 కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్‌కు మంత్రి తుమ్మల విన్నపం 

హైదరాబాద్, సెప్టెంబర్ 6 (విజయక్రాంతి): రాష్ట్రంలో ఆయిల్ పామ్ రైతులకు సరైన ధర లభించే విధంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వరద నష్టాలను పరిశీలించేందుకు వచ్చిన కేంద్ర వ్య వసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌ను కోరారు. శుక్రవారం సచివాలయంలో సీఎం రేవంత్‌రెడ్డి సమ క్షంలో ఆయనను కలిశారు. ఈ సందర్భంగా ఆయిల్‌పామ్  రైతులు కనీస మద్దతు ధర లభించక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.

గతంలో టన్ను రూ. 20వేలు ఉండ గా ఇటీవల కాలంలో కష్టం డ్యూటీని ఎత్తివేశారని తెలిపారు. దీంతో టన్ను ధర రూ. 12 వేలకే కొనుగోలు చేస్తున్నారని రైతులకు గిట్టుబాటు కావ డం లేదన్నారు. కనీసం మద్దతు ధర 2024- సంవత్సరంలో రూ.15 వేలు ఉండేలా సత్వర చర్యలు చేపట్టాలని  కోరారు.  అదేవిధంగా  కొబ్బరి తోటలకు సంబంధించి ఒక రీజినల్ సెంటర్ కొత్తగూడెంలో ఏర్పాటు చేయాలని కోరారు. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ ట్రైబల్ వెల్ఫేర్ ఆర్గాని క్ ఫార్మింగ్‌ను అశ్వారావుపేటలో ఏర్పాటు చేయాలని సూచించారు.  త్వరలో సమస్యలకు పరిష్కారం చూపుతామని కేంద్ర  మంత్రి హామీ ఇచ్చినట్లు తెలిపారు.