calender_icon.png 15 October, 2024 | 4:53 AM

నాణ్యమైన పోషకాహారం అందించాలి

15-10-2024 02:54:49 AM

సిబ్బంది శుచీ శుభ్రత పాటించాలి

మంత్రి సీతక్క ఆదేశం

హైదరాబాద్, అక్టోబర్ 14 (విజయ క్రాం తి): అంగన్‌వాడీ కేంద్రాలకు నాణ్యమైన పోషకాహారం సరఫరా చేయాలని మహిళా, శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క ఆదేశించారు. హైదరాబాద్‌లోని నాచారం టీజీ ఫుడ్స్ గోదాం, తయారీ కేంద్రాన్ని సోమవారం ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. తొలుత ఆహార పదార్థాల ప్రాసెసింగ్ యూనిట్‌ను సందర్శించారు.

యూనిట్ పనితీరుపై అధికారులను ఆరా తీశారు. పదార్థాల తయారీలో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని ఆదేశించారు. సిబ్బంది కచ్చితంగా శుచీ శుభ్రత పాటించాలని సూచించారు. ప్రాసెసింగ్ అయిన ఆహార పదార్థాలను వెంటనే ప్యాక్ చేయాలని,  స్టోరేజ్ పాత్రలపై మెష్‌లు బిగించాలన్నారు.

సాంకేతిక లోపంతో నెల నుంచి స్నాక్ ఫుడ్ యూనిట్ పనిచేయడం లేదని, మరమ్మతు చేయించడంలో ఎందుకు ఆలస్యం చేస్తున్నారని  ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్త యూనిట్లు పదేళ్లుగా పూర్తికాకపోవడంపై విస్మయం వ్యక్తం చేశారు. టీజీ ఫుడ్స్ చైర్మన్ ఫాయీం, ఎండీ శ్రీనివాస్‌రెడ్డి ఉన్నారు.