12-02-2025 01:04:50 AM
దౌల్తాబాద్, ఫిబ్రవరి 11; ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ బి. పాల్వాన్ కుమార్ అన్నారు. మంగళవారం రాయపోల్ మండల కేంద్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరోగ్య కేంద్రాలలో నిర్వహిస్తున్న ఆరోగ్య కార్యక్రమాల పనితీరు, రికార్డులు,ల్యాబ్ లో నిర్వహిస్తున్న పరీక్ష నమూనాల రికార్డులు, ఫార్మసీ గదిలో ఉన్న మందులను ఈ ఔషధ రికార్డులను పరిశీలించారు.
అనంతరం ఆరోగ్య కేంద్రంలో అందుతున్న సేవలను రోగుల వద్దకు వెళ్లి అడిగి తెలుసుకున్నారు.ఆరోగ్య కేంద్రానికి వచ్చిన ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని, ఆస్పత్రికి వచ్చే రోగుల సంఖ్య పెంచాలని, ఫార్మసిస్టులు, ల్యాబ్ టెక్నీషియన్లు రికార్డులను ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవాలన్నారు.
తెలంగాణ హబ్ కు రక్త నమూనాలను అధిక సంఖ్యలో పంపించాలన్నారు.డెలివరీ క్యాలెండర్ అంచనా తేదీ తయారు చేసుకొని ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రసవాలు అయ్యేవిదంగా ప్లానింగ్ చేసుకోవాలనిప్రజలకు ఎప్పుడు వైద్య సిబ్బంది అందుబాటులో ఉండాలని సమయపాలన పాటించాలని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో గజ్వేల్ డిప్యూటీ డిఎంహెచ్వో డాక్టర్ శ్రీనివాస్, ఆరోగ్య కేంద్ర వైద్య అధికారి డాక్టర్ మహరాజ్ బల్లా, సిహెచ్‌ఓ రవీందర్ రెడ్డి, ఆరోగ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.