11-04-2025 12:59:52 AM
కలెక్టర్ సత్యప్రసాద్
జగిత్యాల, ఏప్రిల్ 10 (విజయక్రాంతి): పలు ఆరోగ్య సమస్యలతో ఆసుపత్రికి వచ్చే రోగుల పట్ల సానుకూలంగా స్పందించి, నాణ్యమైన వైద్య సేవలందించాలని జిల్లా కలెక్టర్ బి.సత్యప్రసాద్ పేర్కొన్నారు. ధర్మపురి నియోజకవర్గ కేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని గురువారం జగిత్యాల కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా ఆస్పత్రిలోని ఓపి, ఐపీ సేవల, ల్యాబ్ రికార్డులు, మెడికల్ ఫార్మసి విభాగాలను కలెక్టర్ పరిశీలించారు. ఆసుపత్రిలో వైద్య సేవలను గురించి పేషంట్లనడిగి వివరాలు తెలుసుకున్నారు. వైద్య సేవలు మెరుగు పరచాలని డాక్టర్లు సమయ పాలన పాటించాలని కలెక్టర్ ఆదేశించారు. రోజుకు ఎన్ని ఓ.పి.లను చూస్తున్నారని ఆరా తీశారు.
ఆర్యోగ మహిళా కేంద్రంలో భాగంగా ప్రతి మంగవారం రోజున మహిళలకు ఉచితంగా అందించే 6 రకాల వైద్య పరీక్షలను, థైరాయిడ్ క్యాన్సర్, ఆస్తమా వంటి పరీక్షలు ఎలా చేస్తున్నారు, ఎన్ని చేస్తున్నారో డాక్టర్లను వివరాలడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఆర్డీవో మధుసూధన్, ఎమ్మార్వో కృష్ణచైతన్య. ఎంపీడీవో డిసిహెచ్‌ఎస్ రామకృష్ణ, హెల్త్ సూపరిండెంట్ రవి, కాంట్రాక్టు సైట్ ఇంజనీర్ శ్రీకాంత్, ఆస్పత్రి సిబ్బంది, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.