calender_icon.png 1 February, 2025 | 4:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గురుకుల విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి

01-02-2025 12:00:00 AM

సంగారెడ్డి కలెక్టర్ క్రాంతి వల్లూరు 

సంగారెడ్డి, జనవరి 31 (విజయక్రాంతి) : రాష్ర్ట ప్రభుత్వం మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించేందుకు కృషి చేస్తుందని సంగారెడ్డి కలెక్టర్ క్రాంతి వల్లూరు తెలిపారు. శుక్రవారం సంగారెడ్డి పట్టణంలోని శాంతినగర్ లో ఉన్న మహాత్మ జ్యోతిబాపూలే వెనకబడిన తరగతుల సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలను కలెక్టర్ క్రాంతి వల్లూరు ఆకస్మికంగా తనిఖీ చేశారు.

గురుకుల పాఠశాల నిర్వహణ, వంట గదులు, భోజనశాల వసతి గృహ పరిస్థితులు పరిశీలించారు. పాఠశాలలో ఉన్న బియ్యం, కూరగాయలు, పప్పులు కిరాణా సరుకులు స్టోర్ రూమ్ లో ఉన్న వాటిని తనిఖీ చేశారు. నాణ్యమైన బియ్యంతో వంట చేయాలని ఆదేశించారు.

విద్యార్థులకు రుచికరమైన ఆహారం అందించాలని సూచించారు. పదవ తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించేందుకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని ఆదేశించారు  ఈ కార్యక్రమంలో తాసిల్దార్ దేవదాస్, ఆర్ సి ఓ గౌతమ్ కుమార్, ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.