calender_icon.png 28 December, 2024 | 9:43 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నాణ్యమైన భోజనం అందించాలి

03-12-2024 01:12:41 AM

మున్సిపల్ చైర్‌పర్సన్ ఇందుప్రియ

కామారెడ్డి, డిసెంబర్ 2 (విజయక్రాంతి): విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని మున్సిపల్ చైర్‌పర్సన్ గడ్డం ఇందుప్రియాచంద్రశేఖర్‌రెడ్డి అన్నారు. ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ఆదేశాల మేరకు 15, 16 వార్డుల్లోని మైనార్టీ గురుకులం, బాలికల కళాశాల, వసతిగృహాన్ని ఆమె సోమవారం పరిశీ లించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు, అధ్యాపకుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం వ డ్డించాలని సూచించారు. అనంతరం విద్యార్థులు, కౌన్సిలర్లతో కలిసి భో జనం చేశారు. కార్యక్రమంలో కౌన్సిలర్ వంశీ, వనిత, రాంమోహన్, మ మత, సాయిబాబా, శివకృష్ణమూర్తి, ప్రిన్సిపాల్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.