calender_icon.png 15 November, 2024 | 8:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నాణ్యమైన భోజనం అందించాలి

14-11-2024 12:00:00 AM

  1. నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు
  2. ఆర్సీవో అంజలి హెచ్చరిక
  3. తిమ్మాపూర్ గురుకుల పాఠశాల తనిఖీ 

మానకొండూర్, నవంబర్ 13: కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని రామకృష్ణకాలనీలో గల గన్నేరువరం మండలానికి సంబంధించిన గురుకుల పాఠశాలలో నాణ్యమైన ఆహారం అందక విద్యార్థులు అస్వస్థకు గురవుతున్నారు. దీనిపై విజయక్రాంతిలో బుధవారం ‘గురుకులంలో కల్తీ ఆహారం’ శీర్షికన కథనం ప్రచురితమైంది.

దీనిపై స్పందించిన రీజనల్ కో అంజలి బుధవారం గురుకులాన్ని తనిఖీ చేశారు. గురుకులంలోని వంట గది, డైనింగ్ హాల్, వంట చేసే విధానం పరిశీలించారు. విద్యార్థులు, సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు.  సివిల్ సప్లు అందుతున్నవి కొత్త బియ్యం కావడంతో అన్నం ముద్దలు ముద్దలుగా అవుతున్నట్టు తెలుసుకున్నారు. వండే విధానంపై పలు సూచనలు చేశారు.

విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించడంలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా చర్యలు తప్పవని ఆమె నిర్వాహకులను హెచ్చరించారు. ముద్ద అన్నం తినడంతో కొంతమంది విద్యార్థులకు జీర్ణంకాక సమస్యలు ఎదుర్కొన్నప్పటికీ ప్రస్తుతం వాటిని పరిష్కరించే దిశగా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అనంతరం పిల్లలతో కలిసి భోజనం చేశారు. 

ప్రిన్సిపాల్‌ను మందలించిన ఆర్సీవో

గురుకులంలో ఎదుర్కుంటున్న సమస్యలను తమ పిల్లలు తమకు తెలియజేస్తే విద్యార్థులకు టీసీ ఇచ్చి పంపిస్తానంటూ ప్రిన్సిపాల్ భయభ్రాంతులకు గురి చేస్తున్నాడని కొంతమంది పేరెంట్స్ ఆర్‌సీవో అంజలి దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన ఆమె పిల్లలు, తల్లిదండ్రుల పట్ల మర్యాదగా ప్రవర్తించాలని, తీరు మార్చుకోకుంటే చర్యలు తప్పవని ప్రిన్సిపాల్‌ను హెచ్చరించారు.

విద్యార్థుల తల్లిదండ్రులకు పిల్లల పట్ల సమస్యలు ఏమైనా ఉంటే తన దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తానని చెప్పారు. ఎంతటి వారినైనా ఉపేక్షించకుండా సెక్రటరీ దృష్టికి తీసుకెళ్లి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఇకపై గురుకులంలో విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందిస్తామని తల్లిదం డ్రులు ఎలాంటి ఆందోళనకు గురికావొద్దని ఆమె భరోసా ఇచ్చారు.

విద్యార్థులను తమ సొంత పిల్లలుగా భావించి నాణ్యమైన భోజనం అందించేందుకు ప్రత్యేక దృష్టి సారిస్తానని ఆర్సీవో అంజలి చెప్పారు. ప్రస్తుతం గురుకులంలో ఉన్న విద్యార్థులం దరూ ఆరోగ్యంగా ఉన్నారని చెప్పారు. తల్లిదండ్రులు ఎవరు కూడా ఆందోళన చెందకుండా తమ పిల్లలను పాఠశాలకు పంపించి విద్యాభివృద్ధికి తోడ్పాటు అందిం చాలని ఆమె కోరారు.