15-02-2025 01:23:12 AM
ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి
హబూబ్ నగర్, ఫిబ్రవరి 14 (విజయ క్రాంతి) : ప్రజలకు విద్యుత్ అంతరాయం రాకుండా నాణ్యమైన విద్యుత్ ను అందిం చాలని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ెున్నం శ్రీనివాస్ రెడ్డి సూచించారు.
శుక్రవారం రా నున్న వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని విద్యుత్ అధికారులతో సమీక్ష, వికలాంగుల, వయోవృద్ధుల, ట్రాన్స్ జెండర్స్ వ్యక్తుల సాధికారత శాఖ ద్వారా రూ 69 లక్షల లతో నిర్మించిన సిసి రోడ్డును, గ్రంథాలయ భవనాన్ని, పండుగసాయన విగ్రహావిష్కర ణ, ధర్మపూర్‌లోని, కోడూర్, రామచంద్ర పురం, కోటకదిర ప్రభుత్వ పాఠశాల లోని విద్యార్థులకు డిజిటల్ కంటెంట్ స్టడీ మెటీ రియల్స్ పంపిణీ పంపిణీ చేయడంతో పా టు శిల్పారామంలో నిర్వహించిన నగరోత్స వ వేడుకలకు హాజరై ఎమ్మెల్యే మాట్లాడారు.
అన్ని రంగాలు అభివృద్ధివైపు ముందుకు తీసుకుపోయినప్పుడే మన అందరి లక్ష్యం నెరవేరుతుందని తెలిపారు. ఆ దిశగానే శాస క్తుల కృషి చేస్తున్నామని అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపుని చ్చారు. ముందుగా వచ్చే అవసరాలను దృష్టిలో ఉంచుకొని ప్రతి విషయంలో ముందుకు సాగుతున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యా యులు ఓ.రాములు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహ్మారెడ్డి, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, జిల్లా మత్స్యకారుల సంఘం అధ్యక్షులు గంజి ఆంజనేయులు, డిసిసి ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ, రాములు యాదవ్, రమేష్ యాదవ్, ప్రొద్దు టూరు రఘురామిరెడ్డి తిరుమల వెంకటేష్, పాపారాయుడు, కాటం రాజు, డా.చిక్కా హరీష్ తదితరులు పాల్గొన్నారు.