22-02-2025 04:24:00 PM
న్యాక్ చైర్ పర్సన్ డాక్టర్ ఉమా భరద్వాజ్
కుమ్రం భీం ఆసిఫాబాద్,(విజయ క్రాంతి): విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడంతోపాటు అన్ని సౌకర్యాలు కల్పించాలని నేషనల్ అసెస్మెంట్ అక్రిడిటేషన్ కౌన్సిల్ చైర్ పర్సన్ డాక్టర్ ఉమా భరద్వాజ్(National Assessment and Accreditation Council Chairperson Dr. Uma Bharadwaj) అన్నారు. ఆసిఫాబాద్ మండలం బూరుగుడ సమీపంలోని గిరిజన బాలికల డిగ్రీ కళాశాలను న్యాక్ కోఆర్డినేటర్ డాక్టర్ సుజాతమ్మ, సభ్యుడు డాక్టర్ చంద్రకాంత్ డిగాన్కర్, గిరిజన శాఖ ఓఎస్డి నీరజ్ సింహతో కలిసి తనిఖీ చేశారు. విద్యార్థులతో మాట్లాడి పరిస్థితి అడిగి తెలుసుకుని వారి విషయ సామర్థ్య స్థాయి పరీక్షించారు. ఈ సందర్భంగా ఉమా భరద్వాజ్ మాట్లాడుతూ... విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించే దిశగా కళాశాలలు కృషి చేయాలన్నారు.
కళాశాలలో అందుతున్న వసతులు విద్యార్థుల స్థాయిలను బట్టి కళాశాలలకు గ్రేడింగ్ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. గిరిజన కళాశాలలో వసతులతో పాటు నిర్వహణ పట్ల సంతృప్తిని వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో పీజీ కళాశాల ఏర్పాటు చేసుకునే దిశగా కృషి చేయాలన్నారు. కళాశాల ప్రిన్సిపల్ శారద మాట్లాడుతూ గిరిజన విద్యార్థులకు మౌలిక వసతులతో పాటు నాణ్యమైన విద్య అందించే దిశగా కృషి చేస్తున్నామన్నారు. కళాశాలలో చదువుకున్న అనేకమంది విద్యార్థినిలు పలు ఉద్యోగాలు పొందినట్లు తెలిపారు. విద్యార్థుల సామర్థ్యాల పెంపునకు మరిన్ని చర్యలు తీసుకోనన్నట్లు వివరించారు. కార్యక్రమంలో ఆర్సిఓ అగస్టీన్, ఐక్యుఏసి కోఆర్డినేటర్ కల్పన అధ్యాపక బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.