భవిష్యత్తుకు ఇంటర్ పునాది : ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి
జడ్చర్ల : విద్యార్థులకు ఇంటర్ విద్య ఎంతో ఉన్నతమైనదని జీవితానికి పునాది లాంటిదని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి అన్నారు. సోమవారం జడ్చర్ల పట్టణంలోని నిమ్మబావి గడ్డ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అదనపు తరగతి గదుల నిర్మాణానికి జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడాతూ పేద విద్యార్థుల చదువు కోసం ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుంటుందని చెప్పారు. ప్రభుత్వ కళాశాలల్లో వసతులు కల్పించేందుకు నిధులు మంజూరు చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. విద్యార్థులకు మంచి పునాదివేసి వారి భవిష్యత్తును తీర్చిదిద్దాలని తెలియజేశారు. ఎక్కడ ఇలాంటి ఇబ్బందులు ఉన్న ఆ ఇబ్బందులను పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. కార్యక్రమంలో అధ్యాపకులు, కాంగ్రెస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.