05-03-2025 12:00:00 AM
ఎంపీడీవో కార్యాలయం, జెడ్పీ ఉన్నత పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్ విజయేందిర బోయి
కౌకుంట్ల మార్చి 4: కౌకుంట్ల మండల కేంద్రం లో జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి మంగళవారం ఎం.పి.డి. ఓ కార్యాలయం, జడ్.పి.ఉన్నత పాఠశాలను, గ్రామ పంచాయతీ కార్యాలయం లో నిర్వహిస్తున్న ఎంపిడిఓ కార్యాలయం ను కలెక్టర్ తనిఖీ చేశారు. ఎం.పి.డి. ఓ కార్యాలయం లో ఫర్నిచర్, సివిల్ వర్క్,కంప్యూటర్ ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. అనంతరం జడ్.పి. ఉన్నత పాఠశాలను తనిఖీ చేశారు.
మధ్యాహ్న భోజనం నాణ్యతను కలెక్టర్ రుచి చూసి పరిశీలించారు. సాంబార్ సరిగా లేకపోవడం తో కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. నాణ్యమైన భోజనం మెనూ ప్రకారం అందించాలని అన్నారు. పదవ తరగతి గదిని సందర్శించి విద్యార్థులతో జిల్లా కలెక్టర్ మాట్లాడారు. పాఠశాలలో బోధన,మధ్యాహ్న భోజనం, సాయంత్రం స్నాక్స్ గురించి కలెక్టర్ విద్యార్థులతో అడిగి తెలుసుకున్నారు.
సాయం త్రం 3 రోజులు రాగి జావ, మూడు రోజులు గుగ్గిళ్ళు స్నాక్స్ గా ఇస్తున్నారని తెలిపారు. కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఎం.పి.డి. ఓ,తహశీల్దార్ లు పాఠశాలను సందర్శించి విద్యార్థులు తెలిపిన విషయాలపై నివేదిక సమర్పించాలని ఆదేశించారు.
తర్వాత పి.హె.సి.కి స్టల పరిశీలన చేశారు. ల్యాండ్ సర్వే ఏ.డి.స్థలం.పరిశీలన చేసి ఎటువంటి లిటిగేషన్ లేదని నిర్దారణ చేసిన తర్వాత కేటాయింపు చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎం. పి.డి. ఓ శివ ప్రసాద్, తహశీల్దార్ రహమాన్ తదితరులు ఉన్నారు.