calender_icon.png 23 April, 2025 | 3:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పెండింగ్ ఉద్యోగులకు పదోన్నతులు కల్పించండి

23-04-2025 12:00:00 AM

జలమండలి నూతన డైరెక్టర్ అబ్దుల్ ఖాదర్‌కు జలమండలి ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ స్టాఫ్ వెల్ఫేర్ అసోసియేషన్ సన్మానం

ముషీరాబాద్, ఏప్రిల్ 22 (విజయక్రాంతి): పెండింగ్‌లో ఉన్న జలమండలి ఫైనాన్స్ అండ్ అకౌంట్ కల్పించాలని ఐఎన్‌టీయూసీ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు మొగుళ్ల రాజిరెడ్డి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

ఈ మేరకు మంగళవారం నూతనంగా నియమితులైన జలమండలి డైరెక్టర్ (పర్సనల్ అడ్మినిస్ట్రేషన్) అబ్దుల్ ఖాదర్ కు హైదరాబాద్‌లో జలమండలి ఫైనాన్స్ అం డ్ అకౌంట్స్ స్టాప్ వెల్ఫేర్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు, ఐఎన్‌టీయూసీ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు మొగుళ్ల రాజిరెడ్డి, అధ్యక్షులు కె.రమణ రెడ్డి, ఉపాధ్యక్ష్యులు ఎల్.ప్రభాకర్‌రెడ్డి, పీ.జనార్దన్, అసోసియేట్ అధ్యక్షులు గుల్జార్ అహ్మద్, కే.కమలా శ్రీ, బీ.భీం సింగ్, బీ. నర్సింగ్ రావు, ప్రధాన కార్యదర్శి ఏ.సావీర్ కుమార్, సంయుక్త కార్యదర్శులు ఏ.నవీన్, సీహెచ్. శంకరయ్య, కోశాధికారి బీ.సాయి చరణ్ తదితరులు శాలువా, ఫూలమాలలతో ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫైనాన్స్ విభాగంలో ఆఫీసర్, సీనియర్ ఆఫీసర్, డిజిఎం, జీఎం ఉద్యోగుల పదోన్నతులు దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్నాయని, చాలా మంది ఉద్యోగులు పదోన్నతులు పొందకుండానే ఉద్యోగవిరమణ చేసారని, దీంతో వారు నష్టపోయారని  మొగుళ్ల రాజిరెడ్డి నూతన డైరెక్టర్ అబ్దుల్ ఖాదర్ దృష్టికి తీసుకెళ్లారు.

జలమండలి ఫైనాన్స్ అండ్ అకౌం ట్స్  సిబ్బంది పోస్టుల అప్గ్రేడేషన్ను వేగవంతం చేసి, ఉద్యోగులకు అన్యాయం జర గకుండా చూడాలని వారు విజ్ఞప్తి చేసారు. వీలైనంత త్వరగా ఉద్యోగులకు  పదోన్నతులు కల్పిస్తామని అబ్దుల్ ఖాదర్ హామీ ఇచ్చారని మొగుళ్ల రాజిరెడ్డి తెలిపారు.