calender_icon.png 10 March, 2025 | 4:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లాభాపేక్ష లేని వైద్య సేవలు అందించాలి

10-03-2025 01:03:27 AM

సూర్యాపేట టౌన్, మార్చి 9: వైద్యులు లాభాపేక్ష లేని వైద్య సేవలు అందించాలని వైద్యులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ రామ్మూర్తి యాదవ్ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని వినూత్న న్యూరో, గ్యాస్ట్రో ఆసుపత్రి ప్రధమ వార్షికోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొని మాట్లా డారు. ఆసుపత్రికి వచ్చే రోగులకు నాణ్యమైన వైద్యాన్ని అందించి వారికి వెన్నుద న్నుగా ఉండి వారిపై ఆర్థిక భారం పడకుండా చూసుకోవాలన్నారు.

సమాజంలో వైద్య వృత్తి గొప్పదని దానిని గుర్తించాలన్నారు. వినూత్న ఆసుపత్రి ప్రజల మన్నన లు పొంది ఇంకా అభివృద్ధి చెందాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి యాజమాన్యం మల్లారెడ్డి, కమలాకర్, వేణుమాధవ్, రాజు, వైద్యులు రిజ్వీన్, ఉదయ్, ప్రవల్లిక, అమూల్య, మేనేజ్ మేట్ నగేష్, మధుకర్, మాజీ కౌన్సిలర్లు జ్యోతి కరుణాకర్, నిమ్మల వెంకన్న, తండు శ్రీనివాస్ గౌడ్, సిబ్బంది పాల్గొన్నారు.