21-04-2025 12:00:00 AM
హయత్ నగర్ కార్పొరేటర్ నవజీవన్ రెడ్డి
ఎల్బీనగర్, ఏప్రిల్ 21 : హయత్ నగర్ డివిజన్ లోని కాలనీల్లో ప్రజలకు కనీస, మౌలిక సదుపాయాలు కల్పిస్తానని కార్పొరేటర్ నవజీవన్ రెడ్డి అన్నారు. వస్పరి కాలనీలో కాలనీవాసులు ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో కార్పొరేట ర్ పాల్గొన్నారు. కాలనీలో ప్రధానంగా భూగర్భ డ్రైనేజీ, సీసీ రోడ్ల సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరారు. భూ గర్భ డ్రైనేజీ, సీసీ రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయని, త్వరలోనే పనులను ప్రారంభిస్తామని కార్పొరేటర్ హామీ ఇచ్చారు. సమావేశంలో కాలనీ అధ్యక్షుడు జనార్దన్ రెడ్డి, సంక్షేమ సంఘం సభ్యులు బాల్ రెడ్డి, నర్సింహా రెడ్డి, రా మ్ దాస్, శ్రీనివాస్, లింగారెడ్డి, వెంకట్ రెడ్డి, శ్రీనివాస్, శ్రవణ్ కుమార్, గోవర్ధన్, ప్రభుదాస్, వెంకన్న, రాజు, నర్సింహా రాజు తదితరులు పాల్గొన్నారు.
డివిజన్ అభివృద్ధియే ప్రధాన లక్ష్యం..
హయత్ నగర్ డివిజన్ లోని సాయి మాధవ్ ఎంక్లేవ్ కాలననీవాసులు కార్పొరేటర్ నవజీవన్ రెడ్డిని ఆయన నివాసం లో కలిసి కాలనీలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కోరారు. తెలిపారు. సాయి మాధవ్ ఎంక్లేవ్ కాలనీ ప్రధాన రోడ్ మార్గంలో సీసీ రోడ్డు నిర్మాణానికి నిధులు చేయాలని కోరారు. కార్యక్రమంలో సాయి మాధవ్ ఎంక్లేవ్ అధ్యక్షుడు వి నయ్, కాలనీ కమిటీ సభ్యులు నాగభూషణం, శివ నాయక్, గ్యానేశ్వర్, హరి, వరాహల బాబు, అజిజ్, రంజానాలి తదితరులు పాల్గొన్నారు.
సూర్యానగర్ లో జై భవాని పబ్జీ నాన్ వెజ్ మార్ట్ ప్రారంభం హయత్ నగర్ లోని సూర్యా నగర్ కాలనీలో జై భవాని పబ్జీ నాన్ వెజ్ మార్ట్ ను ఓబీసీ జాతీయ కమిషన్ మాజీ సభ్యుడు తలోజు ఆచారి, కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి ప్రారంభించారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు నర్సింహ, అరుణ్ , బీజేవైఎం డివిజన్ అధ్యక్షుడు ఎర్ర ప్రేమ్ తదితరులు పాల్గొన్నారు.