25-03-2025 10:37:05 PM
ఢిల్లీ వీధుల్లో కదం తొక్కిన యూత్ కాంగ్రెస్ శ్రేణులు..
పాల్గొన్న భద్రాద్రి జిల్లా అధ్యక్షులు చీకటి కార్తీక్..
కొత్తగూడెం (విజయక్రాంతి): పెరుగుతున్న నిరుద్యోగ సంక్షోభాన్ని, యువత ఎదుర్కొంటున్న పెరుగుతున్న సమస్యలను పరిష్కరించడానికి ఉద్యోగాలు కల్పించండి, యువకుల చేతులకు సంకెళ్లు కాదనే నినాదంతో జాతీయ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు ఉదయ భాను చిబ్, యువజన కాంగ్రెస్ జాతీయ ఇంచార్జ్ అల్లవారు కృష్ణ, తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షులు శివచరణ్ రెడ్డి పిలుపు మేరకు మంగళవారం ఢిల్లీలో జరిగిన పార్లమెంట్ ముట్టడి కార్యక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు చీకటి కార్తీక్ తన బృందంతో కలిసి పాల్గొన్నారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. గత ఎన్నికల్లో కేవలం దేవుళ్ళ పేరు చెప్పి కులాల మధ్య మతాల మధ్య గొడవలు పెట్టి గద్దెనెక్కిన బీజేపీ ప్రభుత్వం ఉద్యోగాలు అడిగితే విద్యార్థుల చేతులకు సంకెళ్లు వేసి లక్షలాది విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతుందని విమర్శించారు. ఈ కేంద్ర ప్రభుత్వ నియంత పాలనకు రాబోయే కాలంలో దేశ ప్రజలు కచ్చితంగా గుణపాఠం చెబుతారని అన్నారు. పెరుగుతున్న నిరుద్యోగ సమస్యను జాతీయ స్థాయిలో ఎత్తి చూపి, జవాబుదారీగా ఉండాల్సిన కేంద్ర ప్రభుత్వ వైఫల్యాన్ని దేశ ప్రజలకు తెలియచేసెందుకు నేడు వేలాది మంది యువజన కాంగ్రెస్ కార్యకర్తలు ఢిల్లీ వచ్చినట్లు ఆయన తెలిపారు. భారత యువజన కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు ఉదయ్ భాను చిబ్ సమక్షంలో జరిగిన ఈ నిరసన కార్యక్రమంలో జాతీయ, రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ నాయకులు భారీ స్థాయిలో పాల్గొన్నారు.