calender_icon.png 11 March, 2025 | 4:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించండి

11-03-2025 12:00:00 AM

  1. ఇరిగేషన్ అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లాలి
  2. రైతాంగానికి తోడ్పాటు అందించాలి
  3. సాగునీటిపై వాస్తవ పరిస్థితులను వివరించాలి
  4. ఇరిగేషన్ అధికారులు, అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించిన మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

హైదరాబాద్, మార్చి 10 (విజయక్రాంతి): చివరి ఆయకట్టు వరకు సాగు నీరు అందించాలని రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆదేశిం చారు. హైదరాబాద్‌లోని సచివాలయం నుంచి సోమవారం వ్యవసాయశాఖ మం త్రి తుమ్మల నాగేశ్వరరావు, ప్రభుత్వ సీఎస్ శాంతికుమారితో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో ఆయన మాట్లాడారు.

సాగునీటి విషయంలో రాష్ట్రంలో అసత్య ప్రచారం జరుగుతున్నదని, నీటిపారుదలశాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలని సూచించారు. రైతులకు వీలైనంత తోడ్పా టు అందించాలన్నారు. వాస్తవ పరిస్థితులను రైతాంగానికి వివరించాలని ఆదేశిం చారు. మరో రెండు వారాల్లో యాసంగి పంట చేతికి రానున్నదని, పంటలను కాపాడేందుకు జిల్లా యంత్రాంగం కృషి చేయాలన్నారు.

విద్యుత్‌శాఖ అంతరాయం లేకుండా పంటలకు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని ఆదేశించారు. నీటిపారుదల, వ్యవసాయ శాఖ అధికారులు సమన్వయంతో పనిచేస్తేనే మంచి ఫలితాలు వస్తాయన్నారు.

పంట నష్టంపై అసత్య ప్రచారం: మంత్రి తుమ్మల

బోర్లు వట్టిపోవడం, మోటార్లు కాలిపోవడంతోనే పంట నష్టం వాటిల్లుతున్నదని కొందరు పనిగట్టుకుని అసత్య ప్రచారం చేస్తున్నారని, తద్వారా ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకురావాలని యత్నిస్తున్నారని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మండిపడ్డారు. క్షేత్రస్థాయిలోని వాస్తవాలు బయటకు రాకపోవడం శోచనీయమన్నారు.

రైతులకు సాగునీటి ఇబ్బందులు తప్పించేందుకు అన్నిరకాల జాగ్రత్తలు తీసుకుంటున్నదని, యంత్రాం గం సైతం అప్రమత్తంగా ఉంటూ పంటలకు సాగునీరు అందించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రభుత్వ సీఎస్ శాంతికుమారి మాట్లాడుతూ..

అన్నపూర్ణ సాగర్ నుంచి రంగనాయక సాగర్ కు 1.5 టీఎంసీల నీటిని విడుదల చేయాలని, పంప్ హౌజ్‌ల మరమ్మతులు సత్వ రం పూర్తి చేయాలని నీటిపారుదలశాఖ ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్ లో రాష్ట్ర వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్‌రావు టీజీ ఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ ఫారుఖీ తదితరులు పాల్గొన్నారు.