calender_icon.png 25 November, 2024 | 6:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మెరుగైన వైద్యం అందించాలి

05-11-2024 02:51:02 AM

వాంకిడి ఆశ్రమ పాఠశాలను సందర్శించిన ఎమ్మెల్యే కోవలక్ష్మి

కుమ్రంభీం ఆసిఫాబాద్, నవంబర్ 4 (విజయక్రాంతి): వాంకిడి మండలంలోని ఆశ్రమ పాఠశాలలో ఇటీవల ఫుడ్ పాయిజన్‌తో పలువురు విద్యార్థులు అస్వస్తతకు గురయ్యారు. సోమ వారం ఎమ్మెల్యే కోవలక్ష్మి, ఐటీడీఏ పీఓ ఖుష్బూగుప్తా వేరువేరుగా పాఠశాలను సందర్శించారు. విద్యార్థులతో మాట్లాడి వారికి అందుతున్న సేవలు, సమస్యల గురించి తెలుసుకున్నారు. విద్యార్థుల ఆరోగ్యం పట్ల అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తప్పవని పాఠశాల సిబ్బందిని హెచ్చరించారు. విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని వారి ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటి కప్పుడు నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.