calender_icon.png 8 November, 2024 | 11:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పెన్ డ్రైవ్‌లో మార్గదర్శి వివరాలివ్వాలి

08-11-2024 01:23:28 AM

మార్గదర్శి ఫైనాన్సియర్‌కు హైకోర్టు ఆదేశం

హైదరాబాద్, నవంబర్ 7 (విజయక్రాంతి): మార్గదర్శి ఫైనాన్సియర్స్ చందా వసూళ్లు చట్టబద్ధమో? కాదో? తేల్చుతామని హైకోర్టు స్పష్టం చేసింది. వసూలు చేసిన చందాలు చందాదారులకు ఇచ్చారో లేదో కూడా తేల్చుతామని పేర్కొన్నది. సుప్రీంకోర్టుకు మార్గదర్శి సమర్పించిన వివరాలు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ వద్ద ఫిజికల్ కాపీలున్నప్పుడు ఎలక్ట్రానిక్ కాపీ ఇచ్చేందుకు ఆ సంస్థకు ఉన్న సమస్య ఏమిటో చెప్పాలని అడిగింది.

పెన్‌డ్రైవ్‌లో వివరాలు ఇస్తే అవకతవకలు, అక్రమాలు నిరూపిస్తానని ఉండవల్లి చెప్తున్నందున ఆ వివరాలన్నీ ఇవ్వాలని మార్గదర్శిని ఆదేశించింది. గతంలో ఆదేశించిన మేరకు తెలంగాణ, ఏపీ రాష్ట్రాలు ఎందుకు కౌంటర్లు దాఖలు చేయలేదని ఆగ్రహం వ్యక్తంచేసింది.

డిసెంబర్ 20లోగా కౌంటర్లు వేయాలని రెండు రాష్ట్రాలతోపాటు ఆర్బీఐలకు మరోసారి ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను జనవరి 3కు వాయిదా వేస్తున్నట్టు జస్టిస్ సుజోయ్‌పాల్, జస్టిస్ నామవరపు రాజేశ్వరావు ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీచేసింది.