calender_icon.png 3 March, 2025 | 10:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మీ బిడ్డలా చూసుకోండి

03-03-2025 01:28:25 AM

మంచి భోజనం ఉన్నత చదువు అందించండి 

షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ కమిషనర్ క్షితిజ

మహబూబ్‌నగర్, మార్చి 2 (విజయ క్రాంతి): వసతిగృహాల్లో విద్యనభ్యస్తున్న విద్యార్థులను మీ బిడ్డలా చూసుకోవాలని రాష్ర్ట షెడ్యూల్డ్ కులాల అభివృద్ది శాఖ కమిషనర్ క్షితిజ అన్నారు. ఆదివారం మూసా పేట ఎస్.సి.బాలుర వసతి గృహం సందర్శించిన షెడ్యూల్డ్ కులాల అభివృద్ది శాఖ కమిషనర్ మూసాపేటలోని ఎస్.సి. బాలుర వసతి గృహంను  ఆదివారం సందర్శించారు. వసతి గృహం లో వంట గది, డైనింగ్ హాల్, వసతి గృహంలో గదులు, పరిసరాలు పరిశీలించారు.

వసతి గృహం లోని విద్యార్థులతో ఆమె మాట్లాడారు. విద్యార్థులకు మంచి భోజనంతోపాటు ఉన్నత చదువులను అందించాలని సూచించారు. పదవ తరగతి విద్యార్థులతో మాట్లాడి పరీక్షలకు ఎలా సన్నద్ధం అవుతున్నారు  బాగా  చదివి మంచి తెలుసుకున్నారు. పదవ తరగతి పబ్లిక్ పరీక్షల్లో ఉత్తీర్ణులు కావాలని, విద్యార్థులు తమ కెరీర్ కు బాటలు వేసుకోవాలని సూచించారు. వసతి గృహం కు అవసరమై న రిపేర్ లు, నూతన భవన నిర్మాణంకు ప్రతిపాదనలు పంపాలని  సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో షెడ్యూల్డ్ కులాల అభివృద్ది శాఖ డి.డి.సుదర్శన్ తదితరులు ఉన్నారు.