గ్రామ పంచాయతీలు మరింత బలోపేతం కావడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాల్సి ఉంది. గ్రామ పంచాయతీల అభివృద్ధికి కావలసిన నిధుల కొరత లేకుండా చూడాలి. మౌలిక వస తుల కల్పనకు ప్రభుత్వాలు అధిక ప్రాధాన్యం ఇవ్వడం అవసరం. తాగునీరు, డ్రైనీజీ సమస్యలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. గ్రామా లు ప్రగతిబాట పడితేనే దేశం సర్వతోముఖాభివృద్ధిని సాధిస్తుంది.
షేక్ అస్లాం షరీఫ్, శాంతినగర్