బెల్లంపల్లి (విజయక్రాంతి): నెన్నల మండలంలోని మైలారం గ్రామానికి చెందిన బెల్లంపల్లి వాసవి భజన బృందం సభ్యులు నూతి రాములు చారి ఆర్థిక పరిస్థితి తెలుసుకొని ఆయన కుమార్తె వివాహానికి గోదావరిఖనికి చెందిన వంగల సరోజన మోహన్ దంపతులు అందజేసిన ఆర్థిక సాయంతో మెట్టెలు, మంగళ సూత్రాన్ని ఆర్యవైశ్య వాసవి భజన బృందం సభ్యులు శ్రీ వాసవి ఆలయంలో మంగళవారం రాత్రి రాములు చారి, లక్ష్మి దంపతులకు అందించారు. బెల్లంపల్లి పట్టణానికి చెందిన కొలిపాక రాజేందర్ కుమారుడు కొలిపాక అరవింద్ జన్మదినాన్ని పురస్కరించుకొని డబుల్ కాట్ మంచం, మోటూరి భాస్కర్ కుమారుడు మోటూరి వంశీకృష్ణ తన కూతురు జన్మదిన పురస్కరించుకొని కూలర్, పాత అశోక్ బీరువాను పెళ్లి కోసం అందజేసి తన ఔదార్యాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో వాసవి భజన బృందం అధ్యక్షులు దయాకర్, సెక్రటరీ అంజన్న, సభ్యులు కొలిపాక అరవింధ్, సహాయ కార్యదర్శి ముక్త రాజన్న, గౌరవ సలహాదారులు రేణిగుంట్ల శ్రీనివాస్, ముక్త సాయి తదితరులు పాల్గొన్నారు.