01-03-2025 12:02:37 AM
హైదరాబాద్, ఫిబ్రవరి 28 (విజయక్రాంతి): రైతు భరోసా పథకంలో భాగంగా మూడు ఎకరాల వరకు లబ్ధిదారులకు వెంటనే నిధులు మంజూరు చేయాలని డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క ఆదేశించారు. శుక్రవారం ఉదయం ప్రజాభవన్‌లో స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రఘునందన్‌రావు, డైరెక్టర్ గోపితో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు.
రైతు భరోసా పథకం కింద లబ్ధి పొందిన రైతుల వివరాలను గ్రామాల్లో ఫ్లెక్సీల ద్వారా ప్రచారం చేయాలని ఆదేశించారు. లబ్ధిదారుల పేర్లు అందరికీ కనిపించేలా, గ్రామాల ప్రధాన కూడళ్లలో వీటిని ఏర్పాటు చేయాలని సూచించారు.