calender_icon.png 19 January, 2025 | 10:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భక్తులకు సదుపాయాలు కల్పించండి

19-01-2025 12:00:00 AM

  1. నాటికి నేటికి మార్పు కనిపించేలా సేవ చేయండి
  2. మన్నెంకొండ నూతన పాలకవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి 

మహబూబ్ నగర్ జనవరి 18 (విజయ క్రాంతి) : సాక్షాత్తు భగవంతునికి సేవ చేసే అదృష్టం మీకు లభించిందని ఈ అవకాశా న్ని సద్వినియోగం చేసుకొని ముందుకు అడుగులు వేయాలని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ెున్నం శ్రీనివాసరెడ్డి అన్నారు.

శనివారం మన్యంకొండ శ్రీ లక్ష్మీ వేంకటే శ్వరస్వామి పాలకమండలి నూతన సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవానికి ముఖ్య అతిథిగా నూతన కమిటీ సభ్యులను ప్రమాణ స్వీకారం చేయించిన అనంతరం ఎమ్మెల్యే మాట్లాడారు? గతానికి నేటికీ వ్యత్యాసం ఉండేలా భక్తులకు అవసరమైన సదుపాయాలు కల్పించి భగవంతుని ఆశీర్వాద్రాలు పొందాలని సూచించారు.

భగవంతుని సేవ లభించడం ఇది పూర్వ జన్మ సుకృతమని, దేవుడికి చేరువగా చేరి సేవ చేసుకొనే అవకాశం చాలా అరుదుగా మాత్రమే లభిస్తుందన్నారు. మన్యం కొండ దేవస్థానాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకుందామని, ఉత్సవాలకు వచ్చే భక్తుల కు అన్ని రకాల వసతులు కల్పిస్తామని స్పష్టం చేశారు.

రాష్ర్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఈ దేవాలయ విశిష్టత తెలు సునని, అందుకే దేవాలయ అభివృద్ధికై ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికా రులకు ఆదేశాలు జారీ చేశానని గుర్తు చేశారు. భక్తులకు అధునాతన సౌకర్యాలు ఏమి కావాలో వాటిని గుర్తించి అందించే దిశగా ముందుకు సాగుతున్నామన్నారు.

మన్యం కొండ జాతరకు వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో వస్తారని, కాబట్టి భక్తులకు ఎలాంటి ఇబ్బందులూ లేకుండా సౌకర్యాలు కల్పించాలని ఆయన అధికారులకు ఆదేశించారు. ఈ సందర్భం గా మన్యం కొండ దేవస్థానం వారి నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించారు.

స్వామివారిని ఎమ్మెల్యే ప్రత్యేకంగా దర్శిం చుకున్నారు. ఈ కార్యక్రమంలో దేవాలయ చైర్మన్ అలహరి మధుసూదన్‌చారి, గ్రంథా లయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహ్మారెడ్డి, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ బెక్కెరి అనిత మధుసూదన్ రెడ్డి, వైస్ చైర్మన్ పెద్ద విజయ్ కుమార్, యూత్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మల్లు అనిల్ రెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్య దర్శి రామచంద్రయ్య, బ్లాక్ కాంగ్రెస్ అధ్య క్షులు సుధాకర్ రెడ్డి, ఆసుపత్రి డెవలప్మెం ట్ కమిటీ సభ్యులు బెజ్జుగం రాఘవేంధర్, మన్యం కొండ దేవస్థానం పాలకమండలి సభ్యులు, కాంగ్రెస్ పార్టీ మండల ముఖ్య నాయకులు, కార్యకర్తలు  పాల్గొన్నారు.

అభివృద్ధికి కేరాఫ్ మహబూబ్ నగర్ 

అభివృద్ధికి కేరాఫ్‌గా మహబూబ్ నగర్ ను ముందు వరుసలో నిలబెడతామని ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి అన్నారు. పట్టణం లోని రూ.88.90 లక్షలతో నిర్మిస్తున్న సిసి రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ తోపాటు ఇతర పనులకు శంకుస్థాపన ఎమ్మెల్యే చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లా డుతూ మహబూబ్ నగర్ మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్ గా మారడం జరిగిందని, సీఎం రేవంత్ రెడ్డిని అభివృద్ధి నిమిత్తం రూ.250 కోట్లు అడగడం జరిగిందని పేర్కొన్నారు. విడతల వారికి అభివృద్ధిని వేగవంతంగా చేసుకుంటూ ముందుకు సాగుదామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, తదితరులు ఉన్నారు.