calender_icon.png 2 October, 2024 | 12:02 PM

మత్స్యకారులకు ఉపాధి కల్పించండి

02-10-2024 12:16:11 AM

మత్యశాఖ ఏడీకి వినతి 

నాగర్‌కర్నూల్, అక్టోబర్ 1(విజయక్రాంతి): ప్రభుత్వం పంపిణీ చేస్తున్న ఉచిత చేప పిల్లనను చెరువుల్లో పెంచి, పట్టుకుని స్థానికంగానే అమ్ముకుని ఉపాధి పొందేందుకు అవకాశమివ్వాలని నాగర్‌కర్నూల్ కేసరిసముద్రం మత్య్సశాఖ సొసైటీ సభ్యులు కోరారు. మంగళవారం జిల్లా మత్య్సశాఖ ఏడీ రజినీకి వినతిపత్రాన్ని అందజేశారు.

కొందరు దళారులు సొసైటీలో అక్రమంగా సభ్యత్వం పొందిన వారికి ముడుపులు ఇచ్చి చెరువులోని చేపలను అక్రమంగా తరలించేందుకు అర్రాస్ పాడుతున్నారని వారిపై చర్యలు తీసుకోవాలని కోరా రు.

ఉపాధి లేక చెరువులో వల విరిసి చేపలను పట్టుకుంటున్న కొంతమంది మత్య్సకారులను కులబహిష్కరణ చేస్తామంటూ సొసైటీ నేతలు బెదిరింపులకు దిగుతూ జరిమానాలు విధిస్తున్నట్లు ఆవేదన వ్యక్తం చేశా రు. దీంతో ఏడీ సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది.