calender_icon.png 12 April, 2025 | 4:09 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజలకు శుద్ధమైన తాగునీటిని అందించాలి

13-03-2025 11:29:25 PM

కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): వివిధ రకాల పనుల నిమిత్తం సమీకృత కలెక్టరేట్ కు వచ్చే ప్రజలకు శుద్ధమైన త్రాగునీటిని అందించాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. గురువారం కలెక్టరేట్ భవనంలో ఏర్పాటుచేసిన ఫ్రిడ్జ్  ను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి వచ్చే అర్జీదారులకు శుద్ధమైన చల్లని త్రాగునీటిని అందించే విధంగా తగు చర్యలు తీసుకోవాలని కలెక్టరేట్ పరిపాలన అధికారి మధుకర్ ను ఆదేశించారు. త్రాగునీటి కొరకు ఏర్పాటు చేసిన ఫ్రిడ్జ్ లో ఏమైనా సమస్యలు ఉన్నట్లయితే వెంటనే మరమ్మత్తులు చేపట్టాలని, తక్షణమే త్రాగునీటి ఏర్పాటు చేయాలని తెలిపారు.