calender_icon.png 6 February, 2025 | 12:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి

30-01-2025 12:00:00 AM

వికారాబాద్, జనవరి- 29:   మున్సిపా లిటీలో ఎలాంటి సమస్య లేకుండా అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని మున్సిపల్ ప్రత్యేక అధికారి అడిషనల్ కలెక్టర్ సుధీర్ తెలిపారు. మున్సిపల్ పాలకవర్గం కాలపరిమితి ముగియడంతో మున్సిపల్ ప్రత్యేక అధికారిగా బాధ్యతలు చేపట్టిన అడిషనల్ కలెక్టర్ సుధీర్ బుధవారం వికారాబాద్ మునిసిపల్ ను సందర్శించారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ మున్సిపల్ సిబ్బంది ప్రజలకు మెరుగైన సేవలు అందించాలన్నారు. లక్ష్యం మేరకు పన్ను వసూలు చేయాలని సూచించారు. ఆయా విభాగాల్లో పనిచేస్తున్న మున్సిపల్ సిబ్బంది వివరాలను, చెత్త సేకరణ వాహనాల వివరాలను అడిగి తెలుసుకు న్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ జాకీర్ అహ్మద్ పాల్గొన్నారు.