24-04-2025 12:39:13 AM
అబ్దుల్లాపూర్‌మెట్, ఏప్రిల్ 23: ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించాలని టీఎస్‌సీఏబీ వైస్ చైర్మన్ కొత్తకుర్మ సత్తయ్య అన్నారు. పోచంపల్లి కోఆపరేటీవ్ అర్బన్ బ్యాంక్ అధ్యక్షులు తడక రమేష్ అధ్యక్షతన ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి టీఎస్‌సీఏబీ వైస్ చైర్మన్ కొత్తకుర్మ సత్తయ్య ముఖ్య అతిథులుగా హాజరై ఆయన మాట్లాడుతూ.. ఖా తాదారులకు మెరుగైన సేవలు అందించాలన్నారు. అదే విధంగా బ్యాంక్ యొక్క లావాదేవీలు, లోనింగ్ మరియు వాటి పనితీరును అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమం లో స్థానిక మాజీ కౌన్సిలర్ ధనరాజ్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు భీమ్ రెడ్డి, పోచంపల్లి బ్యాంక్ వైస్ చైర్మన్ రాజేంద్రప్రసాద్, డైరెక్టర్లు, బ్యాంక్ సీఈవో సీత శ్రీనివాస్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.