calender_icon.png 24 December, 2024 | 7:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సాగు రుణాలను సత్వరం అందించండి

24-12-2024 01:06:41 AM

  1. రాష్ట్రానికి వ్యవసాయం వెన్నెముక
  2. ఆర్‌ఆర్‌ఆర్ నిర్మాణానికి అనుమతులు
  3. త్వరలో టెండర్ల ప్రక్రియ పూర్తి
  4. మూసీ పునర్జీవం, స్కిల్, స్పోర్ట్స్ వర్సిటీతో డైనమిక్ రాష్ట్రంగా తెలంగాణ
  5. బ్యాంకర్ల సమావేశంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క 

హైదరాబాద్, డిసెంబర్ 23 (విజయక్రాంతి): బ్యాంకర్లు సాగు రుణాల పంపిణీ లో వేగం పెంచి, రైతులకు సత్వరం రుణాలు అందించాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క ఆదేశించారు. హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో సోమవారం బ్యాంకర్లతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. 

గత ప్రభుత్వం వ్యవసాయం, సంక్షేమ రంగాలను విస్మరించిందని ఆరోపించారు. తమ సర్కారు మాత్రం సాగుకు పెద్దఎత్తున నిధులు విడుదల చేస్తోందన్నారు. మూసీ పునర్జీవం, స్కిల్, స్పోర్ట్స్ యూనివర్సిటీ, ఫార్మా కంపెనీల నిర్మాణాలతో మున్ముందు తెలంగాణ డైనమిక్ రా ష్ట్రం కానున్నదని జోస్యం చెప్పారు.

యాసం గి రుణాల పంపిణీకి మరో నెల సమయం మాత్రమే ఉందని, పంపిణీ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు. సాగుకు తెలంగాణకు వెన్నెముక అని కొనియాడారు. రీ పేమెంట్ పెరిగినా, అప్పులు ఇవ్వడాన్ని తగ్గించడం సరికాదన్నారు. రెండు నెలల వ్యవధిలోనే తమ ప్రభుత్వం రూ.21 వేల కోట్ల రుణాలను మాఫీ చేసిందని గుర్తుచేశారు.

రుణమాఫీ, రైతు భరోసా పథకాల ద్వారా రైతులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు సంక్షేమ పథకాల రూపంలో  తమ ప్రభు త్వం రూ.వేల కోట్ల మేలు జరిగిందన్నారు. రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్) నిర్మాణానికి ఇప్పటికే అనుమతులు వచ్చాయని, త్వరలో టెండర్లు పిలుస్తున్నామని స్పష్టం చేశారు. ‘తెలంగాణ రైజింగ్ స్లోగన్’తో ప్రభు త్వం ముందుకు సాగుతున్నదన్నారు.

బ్యాం కర్లు కూడా దీర్ఘదృష్టితో ఆలోచించి ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని పిలుపునిచ్చారు. బ్యాంకర్లు టర్మ్ లోన్స్ విషయంలో లక్ష్యానికి మించి పని చేయడాన్ని డిప్యూటీ సీఎం అభినందించారు. కార్పొరేట్ కంపెనీలతో పాటు సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు రు ణాలను విరివిగా ఇవ్వాలని సూచించారు.

మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు ప్రభుత్వం ఏటా రూ.20 వేల కోట్ల వడ్డీలేనీ ఇవ్వబోతున్నట్లు వివరించారు. స్వ యం సహాయక సంఘాల సభ్యుల ద్వారా 1000 మెగావాట్ల సోలార్ పవర్ ఉత్పత్తికి ప్రభుత్వం ఒప్పందం చేసుకున్నదని పేర్కొన్నారు. గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తికి అధిక ప్రాధా న్యం ఇస్తున్నట్లు తెలిపారు.