calender_icon.png 11 January, 2025 | 5:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రబీ పంటకు సరిపడా నీళ్లివ్వండి

11-01-2025 02:00:38 AM

  • ప్రభుత్వ లక్ష్యాల సాధనలో ఇరిగేషన్ ఇంజినీర్ల పాత్ర కీలకం
  • నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి 

హైదరాబాద్, జనవరి 10 (విజయక్రాంతి): ఎస్సారెస్పీ టెయిల్ ఎండ్ భూములకు రబీ పంటకు సరిపడ నీళ్లు అందించాలని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం జలసౌధలో ఎస్సారెస్పీ నీటి సరఫరాపై మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఉత్తమ్‌కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. ఎస్సారెస్పీ పరిధిలోని మొత్తం 9.68 లక్షల ఎకరాలకు రబీ సీజన్‌కు గానూ ఆన్, ఆఫ్ పద్ధతిలో నీరు అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. డిసెంబర్ 25న నీటిని విడుదల చేశామని, ఏప్రిల్ 8 వరకు నీటి సరఫరా ఉంటుందన్నారు.  సమీక్షలో నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా, ఈఎన్సీలు అనిల్ కుమార్, విజయభాస్కర్ రెడ్డి, హరేరాం తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వ లక్ష్యాల సాధనలో ఇరిగేషన్ ఇంజినీర్లు ముందుండాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సూచించారు. నీటిపారుదల శాఖలో పనిచేసే ఆఫీసర్లు విధి నిర్వహణలో అలసత్వం చూపరాదని హితవుపలికారు. శుక్రవారం జలసౌధలో హైదరాబాద్ ఇంజినీర్స్ అసోసియేషన్ 2025 డైరీని మంత్రి ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇంజినీర్లు క్రమశిక్షణ, పారదర్శకతకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. అసోసియేషన్ ప్రెసిడెంట్ రాపోలు రవిందర్, ప్రధాన కార్యదర్శి చక్రధర్, గౌరవ అధ్యక్షుడు ధర్మ, వర్కింగ్ ప్రెసిడెంట్ రాజశేఖర్, మధుసూదన్‌రెడ్డి, సత్యనారాయణ గౌడ్ పాల్గొన్నారు.