calender_icon.png 3 April, 2025 | 9:52 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహబూబ్‌నగర్‌కు బైపాస్ రోడ్డు ఇవ్వండి

21-03-2025 12:43:41 AM

  కేంద్ర మంత్రిని కలిసిన ఎంపీ డీకే అరుణ, 

ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి 

మహబూబ్ నగర్ మార్చి 20 (విజయ క్రాంతి) : మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో బైపాస్ రోడ్ ను నిర్మించాలని కేంద్ర రోడ్డు రవాణా & రహదారులు శాఖ మంత్రి నితిన్ గడ్కరీని డిల్లీ లోని వారి కార్యాలయం లో మహబూబ్ నగర్ ఎంపి డీకే అరుణ, మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి కలిసి వినతిపత్రం అందజేశారు. 

ఈ సందర్భంగా మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో బైపాస్ రోడ్ ఆవశ్యకతను కేంద్ర మంత్రికి ఎంపీ, ఎమ్మెల్యే వివరించారు. గతంలో మున్సిపాలిటీ గా ఉన్న మహబూబ్ నగర్ ఇప్పుడు మున్సిపల్ కార్పొరేషన్ గా రూపాంతరం చెందిందని, అలాగే ఎన్నో నూతన విద్యాసంస్థలు, యూనివర్సిటీలు జిల్లా కేంద్రంలో ఏర్పాటు అవుతున్నాయని, మహబూబ్ నగర్ పట్టణానికి కేవలం ప్రధాన రహదారి ఒక్కటే ఉండడం, పెద్దపెద్ద వాహనాలు సైతం పట్టణంలో నుంచే వెళ్ళడం వల్ల ట్రాఫిక్ ఇబ్బందులు కలుగుతున్నాయని వారు వివరించారు.

మహబూబ్ నగర్ పట్టణ జనాభా కూడా అధికంగా ఉండడంతో సాధారణ వాహనాల రద్దీ అధికంగా అవుతుందని కేంద్ర మంత్రికి తెలియజేశారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలో బైపాస్ రోడ్డు ఏర్పాటు చేయుటకు కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.