calender_icon.png 20 January, 2025 | 7:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మంచి చిత్రాన్ని ఏదీ అడ్డుకోలేదని నిరూపించారు

04-08-2024 12:47:11 AM

‘తిరగబడరసామీ’ దర్శకుడు రవికుమార్

రాజ్‌తరుణ్-మాల్వీ మల్హోత్రా నాయకానాయికలుగా నటించిన చిత్రం ‘తిరగబడర సామీ’. మన్నారా చోప్రా మరో కీలక పాత్రలో కనిపించింది. ఏఎస్ రవికుమార్ చౌదరి దర్శకత్వం వహించిన ఈ సినిమాను మల్కాపురం శివకుమార్ నిర్మించారు. శుక్రవారం విడుదలైన ఈ సినిమా సక్సెస్ మీట్‌ను శనివారం హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ కార్యక్ర మంలో చిత్ర దర్శకుడు మాట్లాడుతూ ‘చాలా గ్యాప్ తర్వాత సినిమా చేశాను. మంచి సినిమాను ఏదీ అడ్డుకోలేదని ప్రేక్షకులు నిరూపించారు. ప్రేక్షకులకు హ్యాట్సాప్’ అన్నారు. ‘ఈ సినిమాతో నన్ను తెలుగులో పరిచయం చేసిన నిర్మాత శివకుమార్ గారికి థ్యాంక్స్. మాస్ క్యారెక్టర్ చేశాను’ అని హీరోయిన్ తెలిపింది. మన్నారా చోప్రా మాట్లాడుతూ “తిరగబడరసామీ’కి థియేటర్స్ పెరుగుతున్నాయి. నా క్యారెక్టర్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది” అన్నారు. ప్రొడ్యూసర్ మాట్లాడుతూ ‘మా మూవీ తొలి రోజు 200 థియేటర్లలో విడుదలై, మరుసటి రోజే మరో 28 థియేటర్ల పెరగటం ఆనందంగా ఉంది. చాలా హ్యాపీగా ఈ ప్రాజెక్ట్ చేశాం” అన్నారు. ఈ ఈవెంట్ లో మిగతా చిత్రబృందం పాల్గొన్నారు.