calender_icon.png 3 March, 2025 | 12:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా జిల్లా పరిషత్ బాలికల పాఠశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనం

02-03-2025 08:15:15 PM

మందమర్రి (విజయక్రాంతి): పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో 1997-98లో 10వ తరగతి పూర్తి చేసిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని పాఠశాలలో ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు అందరూ ఒకచోట చేరి చిన్ననాటి మధుర స్మృతులను గుర్తు చేసుకున్నారు. బాల్య మిత్రులందరు పరస్పరం ఆలింగణం చేసుకుని ఒకరి యోగక్షేమాలు మరొకరు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాలలో గడిపిన చిన్ననాటి మధురానుభూతులను నెమరు వేసుకున్నారు. ఈ సందర్బంగా విద్యాబుద్దులు నేర్పి ప్రయోజకులుగా తీర్చిదిద్దిన ఉపాద్యాయులను పూర్వ విద్యార్థులు ఘనంగా సన్మానించి జ్ఞాపికలు అందజేశారు.

అనంతరం పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ... సుదీర్ఘ కాలం అనంతరం బాల్య మిత్రులు చదువుకున్న పాఠశాలలో కలుసుకొని ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొనడం జీవితంలో మరిచిపోలేనిధని ఆన్నారు. ఈ సందర్బంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో నాటి ఉపాద్యాయులు నాగేశ్వర్ గౌడ్, స్వామి, కమలకుమారి, గురు ప్రసాద్, జ్యోతి, పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.