సెమీస్ గడప తొక్కిన సింధు, లక్ష్య
సయ్యద్ మోదీ ఇంటర్నేషనల్
లక్నో: చాలా కాలంగా టైటిల్ వేటలో వెనుకబడ్డ భారత బ్యాడ్మింటన్ స్టార్లు సింధు, లక్ష్యసేన్ సయ్యద్ మోదీ ఇంటర్నేషనల్ 300 టోర్నీలో సెమీస్‌కు చేరుకున్నారు. ఇంకా రెండు గేమ్స్ గెలిస్తే వీరి ఆకలితో పాటు ప్రేక్షకుల ఆకలి కూడా తీరనుంది. శుక్రవారం జరిగిన క్వార్టర్స్‌లో సింధు 21-15, 21-17 తేడాతో డై వాంగ్ (చైనా)కు చెక్ పెట్టింది.
పురుషుల సింగిల్స్ క్వార్టర్స్ మ్యాచ్‌లో లక్ష్యసేన్ 21-8, 21-19 తేడాతో భారత్‌కే చెందిన మెయ్బ్ర లువాంగ్ మీద విజయం సాధించి సెమీస్‌లోకి అడుగు పెట్టాడు. సెమీస్‌లో సింధు భారత్‌కే చెందిన ఉన్నతి హుడాతో, లక్ష్య జపా న్‌కు చెందిన షోంగో ఒగావాతో తలపడనున్నారు.
డబుల్ ఆనందం
మహిళల డబుల్స్‌లో త్రీసా-గాయత్రి జోడీ 21-8, 21-15 తేడాతో గోపై కీ- మెయి క్సింగ్ జోడీపై విజయం సాధించి సెమీస్‌లోకి ప్రవేశించారు. మిక్స్ డబుల్స్ కేటగిరీలో ధ్రువ్ కపిల-తనీషా జోడీ 21-16, 21-13 తేడాతో లూబింగ్- హో లీ (మలేషియా) మీద విజయం సొంతం చేసుకుని సెమీస్‌కు దూసుకెళ్లారు. పురుషుల సింగిల్స్‌లో ఆయుష్ శెట్టి పరాజయం పాలయ్యాడు. మహిళల సింగిల్స్‌లో తన్సిమ్, శ్రియాంశి కూడా క్వార్టర్స్‌లోనే వెనుదిరిగారు. పాండా సిస్టర్స్ 9-21, 4-21 తేడాతో ఘోర ఓటమిని మూటగట్టుకున్నారు.