calender_icon.png 18 January, 2025 | 6:43 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మంచి చిత్రాన్ని తీసినందుకు గర్వంగా ఉంది

11-08-2024 12:02:11 AM

పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్‌ఎల్‌పీ, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్‌పై రూపొందిన చిత్రం ‘కమిటీ కుర్రోళ్లు’. ఈ సినిమాకు యదు వంశీ దర్శకుడు. ఈ నెల 9న విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకాదరణ వస్తున్న నేపథ్యంలో మేకర్స్ శనివారం హైదరాబాద్‌లో సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిత్ర నిర్మాత నిహారిక కొణిదెల మాట్లాడుతూ.. ‘మా చిత్రాన్ని ఆదరిస్తున్న ఆడియెన్స్‌కు థాంక్స్. పెట్టిన ప్రతి పైసా తెరపై కనిపిస్తుందని అంతా అంటున్నారు. ఈ మూవీని ఎవరైనా తక్కువ చేసి మాట్లాడితే జనాలే కౌంటర్లు ఇస్తున్నారు.

ఇంత మంచి చిత్రాన్ని తీసినందుకు మా అందరికీ గర్వంగా ఉంది’ అని అన్నారు. చిత్ర దర్శకుడు వంశీ మాట్లాడుతూ.. ‘నాలుగేళ్ల క్రితం ఈ ప్రయాణం మొదలైంది. సక్సెస్ అనే పదం వినడానికి మూడున్నరేళ్లు పట్టింది. కమిటీ కుర్రోళ్లు సినిమాను ఆడియెన్స్ ముందుకు తీసుకు రావడానికి నిహారిక గారు, పద్మజ గారు.. జయ గారు కారణం. వీళ్లే మా సక్సెస్‌కు కారణం. ఈ మూవీని చూసిన వాళ్లు మలయాళీ చిత్రమని అంటున్నారు. కానీ నిహారిక లాంటి నిర్మాతలుంటే ఇలాంటి చిత్రాలు తెలుగులోనే ఇకపై వస్తాయి.  ఇంకా నిర్మాత జయ అడపాక, అంకిత్ కొయ్య తదితరులు మాట్లాడి తమ అభిప్రాయాలను, అనుభూతులను పంచుకున్నారు.